కామారెడ్డిటౌన్, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డిని గురువారం హైదరాబాద్‌లో కామారెడ్డి జిల్లాకు చెందిన పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ కలిశారు. కొత్త ఏడాది సందర్భంగా సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని నాయకులకు సీఎం సూచించారు.
