నిజామాబాద్, వెలుగు: నగరంలోని బాలసదన్‌లోని అనాథ పిల్లలకు గురువారం సీపీ సాయిచైతన్య నోట్ బుక్స్, పెన్నులు, ఆపిల్ పండ్లు పంపిణీ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా బాలసదన్‌ను విజిట్ చేసిన ఆయన అక్కుడున్న పిల్లలతో సరదాగా గడిపారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు.
చదువులో ముందుకుసాగాలని తమ పక్షాన సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, 4 టౌన్ ఎస్‌హెచ్‌వో సతీష్‌కుమార్, ఎస్సై హరిబాబు, బాలసదన్ సూపరింటెండెంట్లు వినోద, శోభారాణి పాల్గొన్నారు.
