- ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డిటౌన్, వెలుగు : ఈ కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీస్ అధికారులకు సూచించారు. గురువారం కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా జిల్లా పోలీస్ ఆఫీస్‌లో జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఐక్యత, నిబద్దత, కమిట్మెంట్తో విధులు నిర్వహించాలన్నారు.
గత ఏడాది చాలా వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గించామని, ఇతర రాష్ర్టాల గ్యాంగ్‌లను పట్టుకున్నామన్నారు. వరదల విపత్తు సమయంలో అధికారులంతా సమయస్ఫూర్తి, సమన్వయంతో పని చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడారన్నారు. జిల్లా పోలీస్‌శాఖలోని ప్రతి ఒకరూ సేవా భావాన్ని చూపడం ప్రశంసనీయమన్నారు.
నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో శాంతిభద్రలు నెలకొల్పేందుకు పోలీస్‌శాఖ నిరంతరం కృషి చేస్తుందన్నారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, విఠల్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్, సీఐలు, ఎస్సైలు, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
