కుటుంబ కలహాలతో యువకుడు సూసైడ్.. ములుగు జిల్లా మంగపేటలో ఘటన 

కుటుంబ కలహాలతో యువకుడు సూసైడ్.. ములుగు జిల్లా మంగపేటలో ఘటన 

మంగపేట, వెలుగు: ములుగు జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ యువకుడు సూసైడ్​చేసుకున్నాడు. మంగపేట ఎస్సై–2 సురేశ్​తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట మండల కేంద్రానికి చెందిన చిలకల అజయ్​కుమార్​రెడ్డి స్థానికంగా హోటల్​నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబ కలహాలతోపాటు మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం కమలాపురం హైదర్ కుంట చెరువు సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సంధ్యారాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.