వడ్ల కుప్పను ఢీకొని యువకుడు మృతి

వడ్ల కుప్పను ఢీకొని యువకుడు మృతి

సిద్దిపేట రూరల్, వెలుగు: వడ్ల కుప్పను ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట రూరల్ పీఎస్​పరిధిలోని తోర్నాల గ్రామ శివారులో జరిగింది. సీఐ శ్రీను కథనం ప్రకారం.. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన దుబాసి భాను(24) శనివారం రాత్రి తిమ్మాపూర్ గ్రామంలో ఓ ఫంక్షన్​కు హాజరై తిరిగి బైక్​పై ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో తోర్నాల గ్రామ శివారు చింతచిన్నకుంట వద్ద వడ్ల కుప్పను ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. రోడ్డుపై వడ్ల కుప్పలు పోసి తన తమ్ముడి చావుకు కారణమైన తోర్నాలకు చెందిన వాసూరి యాదయ్య, తిరుపతి పై చర్యలు తీసుకోవాలని మృతుడి అన్న ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.