సారంగాపూర్, వెలుగు : ఆన్ లైన్ బెట్టింగ్ ల్లో రూ. లక్షల్లో నష్టపోయిన ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. నిర్మల్ మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ ప్రేమ్ కుమార్(39) ఫెర్టిలైజర్స్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఈజీగా మనీ సంపాదించాలని ఆన్ లైన్ బెట్టింగ్ లు ఆడుతున్నాడు.
సుమారు రూ. 70 లక్షల వరకు నష్టపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమ్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. శనివారం సాయంత్రం చించొలి(బి) శివారులోని మైనార్టీ స్కూల్ కు సమీపంలో డెడ్ బాడీ కనిపించింది. అతడు బ్లేడ్ తో చెయ్యి మణికట్టుపై కోసుకుని ఆత్మహత్య చేసుకోవ డంతో పాటు పురుగుల మందు డబ్బా లభించింది. డెడ్ బాడీని నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
