హైదరాబాద్లో ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి పనిచేస్తున్న సూపర్ మార్కెట్ లోనే కత్తి కొని..

హైదరాబాద్లో ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి పనిచేస్తున్న సూపర్ మార్కెట్ లోనే కత్తి కొని..

ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడితే పోలీసులు కటకటాల వెనక వేస్తారు అనే కామన్ పాయింట్ యువకులు మర్చిపోతున్నారు. ప్రేమించాను కాబట్టి.. నన్ను తప్పక ప్రేమించాల్సిందే అనే ధోరణితో సమస్యలు కొనితెచ్చుకుంటారు. బుధవారం (జులై 23) హైదరాబాద్ లో ప్రేమ పేరుతో వీరంగం సృష్టించిన యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు.

వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామరం లో ప్రేమ పేరుతో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఓ యువతిని ప్రేమ పేరుతో రెండేళ్ల నుంచి వేధిస్తున్నాడు వినయ్(21)అనే యువకుడు. యువకుడి వేధింపులు తాళలేక హైదరాబాద్ కి మకాం మార్చింది యువతి కుటుంబం.

ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్న అమ్మాయి ని వెతుక్కుంటూ వచ్చి.. అదే మార్కెట్ లో కత్తిని కొని యువతి పై దాడికోసం  వేచిచూస్తున్నాడు యువకుడు. పరిస్థితిని గమనించిన యువతి స్టోర్ రూంలోకి వెళ్లి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. 

►ALSO READ | హైదరాబాద్ ఉప్పల్లో సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్స్ అంటూ ఆఫర్ లెటర్స్.. తీరా అక్కడికెళ్లి చూస్తే..

దీంతో సూపర్ మార్కెట్ కు చేరుకున్న కుటుంబ సభ్యులు.. స్టోర్ సిబ్బంది సహాయంతో యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. గత రెండేళ్లుగా వేధింపులకు పాల్పడుతుండటంతో.. తమ కూతురికి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు తల్లిదండ్రులు, స్థానికులు. 

యువతి ఫిర్యాదుతో వినయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి నుంచి కత్తి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.