తిరుమల శ్రీవారి హుండీకే కన్నం వేయాలని చూశాడు ఓ ప్రబుద్ధుడు. మంగళవారం మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలోని హుండీలో ఓ యువకుడు చోరీకి ప్రయత్నించాడు. నిందితుడు హుండీలోని రూ. 30 వేలు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో విజిలెన్స్ అధికారులు శ్రీవారి ఆలయ సీసీటీవీ కెమెరాల ద్వారా అతడు చోరీ చేస్తుండగా విజిలెన్స్ అధికారులు రెడ్‌హ్యాండెట్‌గా పట్టుకున్నారు. సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
