పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు దుర్గామాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
వేద పండితులు శంకర శర్మ, పార్థివ్ శర్మ, రాము, నాగరాజు, రాజశేఖర్ శర్మ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
