చెన్నూరు, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా క్యాంపు ఆఫీస్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అంతకుముందు చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ లీడర్లు మేడ తిరుపతి రెడ్డి–-ఇందిరా దంపతులను కలిసి పరామర్శించారు.
ఇటీవల తిరుపతిరెడ్డికి బైపాస్ సర్జరీ జరగడంతో ఆయనను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెన్నూరు టౌన్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన సయ్యద్సాదిక్హుస్సేన్ కూతురు వివాహ వేడుకల్లో మంత్రి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి వెంట స్థానిక కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.
