మందమర్రి వ్యాపార సంఘం అధ్యక్షుడిగా కనకయ్య

మందమర్రి వ్యాపార సంఘం అధ్యక్షుడిగా కనకయ్య

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణం పాత బస్టాండ్​ఏరియా వ్యాపార సంఘం అధ్యక్షుడిగా వడ్లకొండ కనకయ్య గౌడ్​ఎన్నికయ్యారు. స్థానిక కృష్ణవేణి టాలెంట్​స్కూల్​లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. కనకయ్యతోపాటు గుడికందుల రమేశ్, జైన శ్రీధర్, నాకోటి వెంకటేశ్​అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. మొత్తం 343మంది ఓటర్లు ఉండగా ఉదయం 335 మంది ఓటు వేశారు. 

కనకయ్య గౌడ్​126 ఓట్లు సాధించి వ్యాపార సంఘం అధ్యక్షుడిగా గెలుపొందాడు. రమేశ్​కు 94, శ్రీధర్​కు 83, వెంకటేశ్​కు 31 ఓట్లు వచ్చాయి. కొత్త అధ్యక్షుడిని​ వ్యాపారులు, అభిమానులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వపరంగా అందాల్సిన సంక్షేమ ఫలాలను ఇప్పించేందుకు చొరవ చూపుతానని పేర్కొన్నారు.