పేదల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం : మెదక్ ఎంపీ రఘునందన్ రావు

పేదల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం : మెదక్ ఎంపీ రఘునందన్ రావు

సిద్దిపేట, వెలుగు: పేదల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పని చేస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మిరుదొడ్డిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ సర్టిఫికెట్లు అందించారు. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు వంట గ్యాస్ అందడమే కాకుండా కట్టెల పొగ ఇబ్బందులు పోయి గ్రామీణ మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో మిరుదొడ్డి సర్పంచ్ ఎలుముల మహేశ్వరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, మండల అధ్యక్షుడు జిగిరి అమర్, నాయకులు శ్రీనివాస్, భిక్షపతి, కనకరాజ్, అంజిరెడ్డి, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.