అయోధ్య భూమి పూజకు కాలినడకన బయలుదేరిన ముస్లీం యువకుడు

అయోధ్య భూమి పూజకు కాలినడకన బయలుదేరిన ముస్లీం యువకుడు

రామ జన్మభూమి అయోధ్యలో కట్టబోయే రామ్ మందిర్ భూమి పూజకు ఒక ముస్లీం యువకుడు కాలినడకన బయలుదేరాడు. మహమ్మద్ ఫైజ్ ఖాన్ అనే ముస్లీం యువకుడు రాముడికి భక్తుడు. అందుకే ఆయన రాముని యొక్క తల్లి కౌసల్యా దేవి జన్మస్థలం అయిన చత్తీస్ ఘర్ లోని చాంద్ ఖురి గ్రామం నుంచి తన యాత్రను ప్రారంభించాడు. చాంద్ ఖురి నుంచి అయోధ్యకు దాదాపు 800 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం ఫైజ్ ఖాన్ మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ వరకు చేరుకున్నాడు. వచ్చే నెల ఆగష్టు 5న అయోధ్యలో జరిగే భూమి పూజకు ఆలోపు చేరుకుంటానని ఫైజ్ ఖాన్ అంటున్నాడు. తాను ఇంతలా స్పూర్తి పొందడానికి కారణం పాకిస్తాన్ జాతీయ కవి అల్లామా ఇక్బాల్ అని ఫైజ్ ఖాన్ వెల్లడించాడు.

తనపై వచ్చే విమర్శలన్నింటినీ ఫైజ్ తోసిపుచ్చాడు. పాకిస్తాన్లో కొంతమంది హిందూ మరియు ముస్లిం పేర్లతో నకిలీ ఐడీలను సృష్టించుకొని అల్లర్లకు పాల్పడుతున్నారని ఫైజ్ అన్నాడు. అలాంటి వాళ్లు భారతదేశంలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నాడు. తానొక ముస్లీం అయినప్పటికీ తనకు రాముడంటే చాలా భక్తి అని ఫైజ్ వెల్లడించాడు. రాముడి తల్లి కౌసల్య పుట్టినప్రాంతం నుంచి కొంత మట్టిని రామ్ మందిర్ నిర్మాణం కోసం తీసుకెళ్తున్నట్లు ఫైజ్ తెలిపాడు.

భూమి పూజ సందర్భంగా గర్భగుడి లోపల ఐదు వెండి ఇటుకలు అమర్చబడతాయి. ఈ ఐదు ఇటుకలు హిందూ పురాణాల ప్రకారం ఐదు గ్రహాలకు ప్రతీక అని నమ్ముతారు. ఆగస్టు 3 నుండి ప్రారంభమయ్యే ఈ వేడుకలకు పూజారులు రామ్ జన్మభూమి వద్ద మూడు రోజుల పాటు వేద కర్మలతో పూజలు నిర్వహిస్తారు. ఆగస్టు 4న రామచార్య పూజ జరుగుతుంది. ఆ తర్వాతి రోజు ఆగస్టు 5న భూమి పూజ మధ్యాహ్నం 12:15 గంటలకు జరుగుతుంది.

For More News..

ఇంటర్ స్టూడెంట్ కి ప్రధాని మోడీ ఫోన్

ఇదే నా చివరి వీడియో.. వీడియో పోస్ట్ చేసి హీరోయిన్ ఆత్మహత్యాయత్నం

బస్టాండులో గుర్తుతెలియని మహిళ శవం.. శవం పక్కన..