ప్రేమ పేరుతో మోసగించాడని..

V6 Velugu Posted on Aug 09, 2020

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా
బ్లేడ్‌‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నం
చేర్యాల, వెలుగు: ప్రేమ పేరుతో నమ్మించి మోసగించాడని ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది . ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని అర్జున్పట్లలో శుక్రవారం జరిగింది. బాధితురాలు, గ్రామస్తులు కథనం ప్రకారం.. అర్జున్‌‌ పట్లకు గుండెల్లిలావణ్య అనే వికలాంగ యువతి, అదే గ్రామానికి చెందిన తాళ్ల‌ పల్లి సురేశ్‌గౌడ్ ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. కొన్నిరోజులు కలిసి తిగిన సురేశ్‌ పెండ్లి విషయం వచ్చేసరికి ఆమెను దూరం పెట్టాడు.

దీంతో మోసపోయానని గుర్తించిన లావణ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఎలాగైనా సురేశ్‌తో తనకు పెళ్లి చేయించాలని బైఠాయించింది. ఓ దశలో ఆమె బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ విషయంపై మద్దూరు ఎస్సై సంపత్ను వివరణ కోరగా లావణ్య ప్రేమ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇద్దరి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా లావణ్యకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సుతారి రమేశ్‌, ఇతర వికలాంగల నాయకులు పేర్కొన్నారు.

Tagged love, women, lover

Latest Videos

Subscribe Now

More News