ఆ ఒక్కటీ అడక్కు మూవీ టైటిల్ గ్లింప్స్‌‌ రిలీజ్

ఆ ఒక్కటీ అడక్కు మూవీ టైటిల్ గ్లింప్స్‌‌ రిలీజ్

కొంత కాలంగా వరుస సీరియస్ సబ్జెక్టులతో మెప్పిస్తున్న అల్లరి నరేష్.. తిరిగి తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా తన 61వ సినిమాను ప్రకటించాడు. మల్లి అంకం దర్శకుడి గా పరిచయమవుతున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే  టైటిల్‌‌ను ఫిక్స్ చేశారు.

నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారా యణ ఇరవై రెండేళ్ల  క్రితం ఇదే టైటిల్‌‌తో సూపర్ హిట్‌‌ను అందించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు తన తండ్రి టైటిల్‌‌తో వస్తున్నాడు నరేష్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ హిలేరియస్‌‌గా ఉంది.  ఇందులో నరేష్ పాత్ర పేరు గణ.  తన పెళ్లి గురించి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అడుగుతారు.

ఈ సందర్భంలో  టైటిల్‌‌ను రివీల్ చేస్తూ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని వారందరికీ  సమాధానమిచ్చాడు నరేష్.  పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య అని చెప్పడం సినిమాపై బజ్‌‌ను పెంచేలా ఉంది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.