స్పెషల్ ఫోకస్ ఆన్ ఏఏ22... ముంబైలో భారీ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్...

స్పెషల్ ఫోకస్ ఆన్ ఏఏ22... ముంబైలో భారీ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్...

అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌‌లో ఓ భారీ పాన్ ఇండియా  చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ టెక్నీషియన్స్‌‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌‌ కోసం టీమ్ బాగా కసరత్తులు చేస్తోంది. ఇందులో అల్లు అర్జున్ సైతం యాక్టివ్‌‌గా పాల్గొంటూ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. తాజాగా మరోసారి ముంబై వెళ్లాడు బన్నీ.  తను ఎయిర్ పోర్ట్‌‌లో  స్టైలిష్‌‌  లుక్‌‌లో కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

ఇప్పటికే లుక్‌‌ టెస్ట్‌‌తో పాటు నటీనటుల సెలెక్షన్ పూర్తయింది. దీంతో  ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది.   ఫస్ట్ షెడ్యూల్‌‌ను కూడా  ముంబైలోనే  మొదలుపెట్టనున్నారట. దీనికోసం ఓ భారీ సెట్‌‌ను వేశారని అక్కడే మూడు నెలలు  చిత్రీకరించనున్నారని సమాచారం.  

ఈ షెడ్యూల్‌‌లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు  యాక్షన్ సీన్స్‌‌ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది.  అల్లు అర్జున్ నటిస్తున్న 22వ సినిమా కాగా, అట్లీ డైరెక్ట్ చేస్తున్న 6వ సినిమా ఇది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌‌లో కనిపించబోతున్నాడట. దీపికా పదుకొనె హీరోయిన్‌‌గా నటిస్తోంది.