
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో ఆధార్ అథంటికేషన్ (ధృవీకరణ) లావాదేవీలు ఏడాది లెక్కన 7.8శాతం పెరిగి 229.33 కోట్లకు చేరాయని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) గురువారం పేర్కొంది.
ఆధార్ ప్రారంభం నుంచి జరిగిన ఇటువంటి లావాదేవీల సంఖ్య 15,452 కోట్లను దాటింది. 39.47 కోట్ల ఈ-కేవైసీ లావాదేవీలు జరిగాయి. ఏఐ/ఎంఎల్(మెషీన్ లెర్నింగ్) ఆధారిత ఫేస్ అథంటికేషన్ లావాదేవీలు ఈ ఏడాది జూన్‌లో 15.87 కోట్లుగా ఉన్నాయి.