కుటుంబ పెద్ద అనుమతితో ఆధార్ అప్డేట్

కుటుంబ పెద్ద అనుమతితో ఆధార్ అప్డేట్

ఆధార్ లేనిదే అసలు గుర్తింపే లేదు. ఆధార్ అంటే అంత ముఖ్యమైన డాక్యుమెంట్. భారతీయ పౌరుడిగా గుర్తింపు కోసం ప్రతి ఒక్కరూ వాడే డాక్యమెంట్ ఆధార్. అయితే ఇతర డాక్యుమెంట్లతో పోలిస్తే ఆధార్ కొంచెం భిన్నమైంది. ప్రజల బయోమెట్రిక్ సమచారమంతా ఇందులోనే ఉంటుంది. అయితే ఆధార్ వాడకం పెరుతుండటంతో.. దీన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఆధార్‭లో మార్పుల కోసం ఇప్పటికీ మీ సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే తాజాగా.. కుటుంబ పెద్దల అనుమతితో ఆధార్‭లోని చిరుమానాలను ఆన్‭లైన్‭లోనే అప్‭డేట్ చేసుకోవడానికి UIDAI అధికారికంగా ప్రకటన చేసింది. 

రేషన్ కార్డు, మార్క్ షీట్, వివాహ ధృవీకరణ పత్రం, పాస్ పోర్టు మొదలైన డాక్యుమెంట్లతో పాటు, ధరఖాస్తుదారు తమ కుటుంబ పెద్ద.. వారి మధ్య ఉన్న సంబంధాన్ని పేర్కొన్న తర్వాత ఆధార్‭లో మార్పు చేసుకోవచ్చు. ఆధార్‭లోని HOF ఆధారిత ఆన్‭లైన్ చిరునామా అప్ డేట్ వారి ఆధార్‭లోని చిరునామాను అప్‭డేట్ చేయడానికి వారి స్వంత పేరు మీద సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేని పిల్లలు, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులుకి సహాయం చేస్తుంది. దేశంలోని వివిధ కారణాల వల్ల ప్రజలు నగరాలు, పట్టణాలకు తరలివెళుతున్నారు. ఇలాంటి సౌకర్యం వల్ల మిలియన్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. UIDAI నిర్దేశించిన ఏదైనా చెల్లుబాటయ్యే చిరునామా పత్రాన్ని ఉపయోగించి చిరునామాను మార్చుకోవచ్చు. మై ఆధార్ పోర్టల్ ని ఉపయోగించి నివాసితులు ఆన్‌లైన్ చిరునామాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.