అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ అప్ డేట్ 

అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ అప్ డేట్ 

ప్రస్తుతం ఆధార్ ప్రాముఖ్యత బాగా పెరిగింది. 12 అంకెల ఈ విశిష్ట గుర్తింపు కార్డును UIDAI సంస్ధ జారీచేస్తుంది. వ్యక్తి సమాచారం తెలుసుకోవటం దీని ద్వారా చాలా ఈజీ. ఆధార్ కార్డును పొందిన వారు చాలా మంది వివిధ కారణాలతో అడ్రస్ లు మార్చుకోవాల్సి వస్తుంది. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళటం ఈ తరహా పరిస్ధితుల కార్యక్రమంలో అడ్రస్ మార్చటం తప్పనిసరి అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఏదో ఒక ప్రూఫ్ కావాలని ఆధార్ అప్ డేట్ సెంటర్ సిబ్బంది చెబుతుంటారు. అడ్రస్ ఫ్రూఫ్ లేకపోవటంతో చాలా మంది ఆధార్ అప్ డేట్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతుంటారు.

అయితే ప్రస్తుతం UIDAI ఆధార్ అప్ డేట్ కోసం అడ్రస్ ఫ్రూఫ్ తో పనిలేకుండా ఆధార్ అడ్రస్ మార్చుకునేలా వెసులుబాటు కల్పించింది. ఆధార్ కార్డ్ లో అడ్రస్ వివరాల్లో మార్పులు చేయటాలంటే పాస్ పోర్ట్ , బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఆధార్ అడ్రస్ అప్ డేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం UIDAI ఇచ్చిన వెసులుబాటుతో బంధువులు, ఇతర కుటుంబసభ్యుల ఆధార్ ప్రూఫ్ తో అడ్రస్ మార్చుకునేందుకు అవకాశం ఏర్పడింది.

మీ అధార్ కార్డులో అడ్రస్ ను మార్చుకోవాలంటే..
1. ఆధార్ లో అడ్రస్ అప్ డేట్ చేయాలనుకునే వారు https://uidai.gov.in/ వెబ్ సైట్ లింకును ఓపెన్ చేయాలి.
2.లింక్ ఓపెన్ అయ్యాక మీ కుటుంబసభ్యుల ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వాలి.
3. తర్వాత  ఆధార్ కార్డ్, కాంటాక్ట్ నెంబర్ తో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
4. చెక్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ అడ్రస్ మార్చుకునేందుకు ఓ అప్రూవల్ లింక్ వస్తుంది.
5.వచ్చిన లింక్ పై క్లిక్ చేసి దానిని ఓ పెన్ చేసి మనం ఏఅడ్రస్ అయితే  ఇవ్వాలనుకున్నామో  దాన్ని అందులో పొందుపరచాలి.
6. రిక్వెస్ట్ సమయంలో మీ కాంటాక్ట్ నెంబర్ ను ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్ అడ్రస్ మార్చుకునేందుకు 28 అంకెల సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
7. 28 అంకెల SRN నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ మార్చుకునేలా రిక్వెస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇదంతా పూర్తయ్యాక ఓ పిన్ నెంబర్ మీ చిరునామాకు పోస్ట్ ద్వారా మీరు మార్చుకున్న అడ్రస్ కు వస్తుంది.
8. ఆ సీక్రెట్ కోడ్ ను ఎంటర్ చేసిన ఆధార్ అడ్రస్ రివ్యూ ఆఫ్షన్ పై క్లిక్ చేయాలి. గడువు సమయం ముగిసిన తర్వాత మీ ఆధార్ లో అడ్రస్ అప్ డేట్ ప్రక్రియ పూర్తవుతుంది.