ఆదికేశవ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన శ్రీలీల

ఆదికేశవ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన శ్రీలీల

మెగా హీరో వైష్ణవ తేజ్ (Panja Vaisshnav Tej) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ జోజు జార్జ్ (Joju George) విలన్ నటిస్తున్నాడు.

Also Read : 7జీ టైటిల్పై వివాదం.. పెట్టొదంటూ బెదిరింపు కాల్స్

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్ ప్రేక్షకులను అలరించగా.. తాజాగా సిత్తరాల సిత్రావతి అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఫాస్ట్ బీట్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా పాడారు. ఇక సాంగ్ లో వైష్ణవ్ అండ్ శ్రీలీల వేసిన గ్రేస్ఫుల్ స్టెప్పులు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. అవి చూస్తుంటే థియేటర్స్ దద్దరిళ్లిపోయేలా ఉంది. ఇప్పటికె నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.