‘లైగర్’ నుండి మరో సాంగ్ వస్తోంది

‘లైగర్’ నుండి మరో సాంగ్ వస్తోంది

హీరో విజయ్ దేవరకొండ నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘లైగర్’. ‘సాలా క్రాస్‌బ్రీడ్’ దీనికి ట్యాగ్‌లైన్. విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ విజయ్ కి పాత్ర కనిపించనుంది. ఈ సినిమాలో ప్రపంచ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ నెల 25న చిత్రం పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ నుండి వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ఈ నెల 5వ తేదీన ‘ఆఫట్’ అనే సింగిల్ ను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సాంగ్ ప్రోమోను ఇవాళ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాట చిత్రంలో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. తల్లీ, కొడుకుల మధ్యకు వచ్చే ఓ బ్యూటీ ఫుల్ డ్రామా క్వీన్ ఎప్పుడూ ఉంటుంది అంటూ విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది. సునీల్ కాశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నాడు.