ఇంజనీరింగ్​ పనుల్లో భారీ అవినీతి

ఇంజనీరింగ్​ పనుల్లో భారీ అవినీతి

జీడిమెట్ల, వెలుగు: నిజాంపేట మున్సిపల్​ కార్పొరేషన్ ​పరిధిలో జరిగిన ఇంజనీరింగ్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిజాంపేట బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీశ్ అరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల్లో రూ.140 కోట్ల పనులు జరగ్గా అన్ని పనుల్లో నాణ్యతాలోపం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. 28 శాతం కమీషన్లతో పనులు చేశారని, మేయర్​భర్త, ఇంజనీరింగ్​అధికారులు కుమ్మకై అవినీతికి తెరలేపారని ఆరోపించారు.

నాణ్యత లేకుండా వేసిన రోడ్డు పనులకు పూర్తిస్థాయి చెల్లింపులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అర్హత ఉన్నవారిని పక్కన పెట్టి అర్హత లేని వారిని ఇంజనీరింగ్​డిపార్ట్​మెంట్​లో పనిచేయిస్తున్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో రామచంద్రనాయక్, భిక్షపతి, శేషారావు మంజు, మదన్​గౌడ్​తదితరులు పాల్గొన్నారు.