
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ (Aamirkhan) ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కూతురు ఇరా ఖాన్ హల్దీ వేడుకలు నిన్న జరిగాయి. ఇరా ఖాన్ (Ira Khan) తన జిమ్ కోచ్ నూపుర్ షికారే(Nupurshikare)ని ప్రేమించి పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల మొదటి వారంలో పెళ్లి జరుగుతుందని గతేడాది అమీర్ స్వయంగా వెల్లడించారు. ఇక ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఈవెంట్లో అమీర్ సింపుల్గా సాధారణ టీషర్ట్ ధోవతీ ప్యాంట్లో కనిపించాడు. అమీర్ తల దువ్వకుండా గజిబిజిగా ఉన్న కేశాలంకరణ ఆశ్చర్యపరిచింది. ఇరా ఖాన్ తన వివాహ వేడుకలను ప్రారంభించడానికి తన తండ్రి అమీర్ ఖాన్ ఇంటికి చేరుకున్న ఫొటలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించబోతున్నందున ఖాన్ కుటుంబం ఉప్పొంగిపోయింది. ఇరా - నుపూర్ జనవరి 3న బాంద్రాలోని ఖరీదైన తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో వివాహం చేసుకోనున్నారు. ఆ తర్వాత రెండు రిసెప్షన్ పార్టీలు జరుగుతాయి. ఒకటి ఢిల్లీలో.. మరొకటి జైపూర్‌లో జనవరి 6 - 10 మధ్య ఈ పార్టీలు ఉంటాయని తెలిసింది.