ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. రిపబ్లిక్ డే నాడు కూడా ప్రచారం సాగిస్తున్నాయి పార్టీలు. ఘోండా ఏరియాలో రోడ్ షో చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఐదేళ్ల కేజ్రీవాల్ పాలనలో ఢిల్లీ వెనకబడిందని అమిత్ షా ఆరోపించారు. బీజేపీని గెలిపించాలని కోరారు. సాయత్రం మండోలీ రోడ్ లో రోడ్ షో చేయనున్నారు అమిత్ షా. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తన నియోజకవర్గమైన న్యూఢిల్లీలో ప్రచారం చేశారు కేజ్రీవాల్. ప్రజల్లోకి వెళ్లి అభివృద్ధి కొనసాగాలంటే ఆమ్ ఆద్మీ పార్టీని మరోసారి గెలిపించాలని కోరారు.

