నాలుగేండ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ సరి బేసి

నాలుగేండ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ సరి బేసి
  •     అమల్లోకి తెస్తున్న ఆప్ సర్కారు
  •     ఈ నెల 13 నుంచి 20వ తేదీ దాకా వెహికల్స్‌‌‌‌‌‌‌‌పై ఆంక్షలు
  •     మినహాయింపుల వివరాలు త్వరలో వెల్లడిస్తం: ఢిల్లీ మంత్రి
  •     10వ తేదీ దాకా స్కూళ్లలో ఫిజికల్ క్లాసులు బంద్

న్యూఢిల్లీ/చండీగఢ్ : ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు మళ్లీ సరి బేసి విధానాన్ని అమలుచేయాలని డిసైడ్ అయింది. దాదాపు నాలుగేండ్ల తర్వాత వెహికల్స్‌‌‌‌‌‌‌‌ రాకపోకలపై ఆంక్షలు విధించనుంది. ‘‘దీపావళి తర్వాత ఢిల్లీలో ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు సరి- బేసి విధానం అమల్లోకి వస్తుంది. దీన్ని పొడిగించాలా? వద్దా? అనేది 20వ తేదీ తర్వాత నిర్ణయిస్తాం” అని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు.

రవాణా శాఖతో చర్చించిన తర్వాత.. మినహాయింపులు సహా ఇతర పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. వాయు కాలుష్య నియంత్రణ కోసం.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్  చివరి దశ కింద నిర్దేశించిన కఠిన ఆంక్షలను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో 50% సిబ్బంది ఇంటి నుంచే పనికి సంబంధించిన నిర్ణయాన్ని దీపావళి తర్వాత తీసుకుంటామని చెప్పారు.

ఇంకా ప్రమాదకర స్థాయిలోనే..

రానున్న రోజుల్లో గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని, దీంతో పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ తగ్గొచ్చని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. దీపావళి, వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు, ఛత్‌‌‌‌‌‌‌‌ పూజ సందర్భంగా పటాకులను కాలిస్తే గాలి నాణ్యత మరింత పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నెల 10 దాకా ఫిజికల్ క్లాసులను బంద్ చేయాలని ఆదేశించారు. బోర్డు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న 10, 12వ తరగతి విద్యార్థులకు మినహాయించారు.

మరోవైపు, ప్రభుత్వం పేర్కొన్న సేఫ్ లిమిట్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే.. సోమవారంకూడా ఢిల్లీ- ఎన్సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 నుంచి 8 రెట్లు ఎక్కువగా కాలుష్య స్థాయి నమోదైంది. వరుసగా ఏడో రోజు కూడా విషపూరిత పొగమంచు కొనసాగింది. సెంట్రల్ ఢిల్లీలోని కాలిబాటలు, వీధులను వెంటనే క్లీన్ చేయాలని అధికారులను ఎల్జీ వీకే సక్సేనా ఆదేశించారు. కాగా, పొల్యూషన్ హైలెవెల్‌‌‌‌‌‌‌‌లో ఉన్న నేపథ్యంలో తమ పరిధిలోని జిల్లాల్లో స్కూళ్లను బంద్ చేయడంపై సమీక్షించి, నిర్ణయం తీసుకోవాలని ఎన్సీఆర్ డిప్యూటీ కమిషనర్లను హర్యానా ప్రభుత్వం కోరింది.

ఏంటీ సరి - బేసి రూల్​?

ఢిల్లీలో తొలిసారిగా 2016లో సరి- బేసి విధానాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో ఈ రూల్​ అమలు చేయడం ఇది నాలుగో సారి. ఇందులో భాగంగా.. సరి, బేసి నంబర్ ప్లేట్ల ఆధారంగా కార్లు, ఇతర వాహనాలు రోడ్లపైకి వచ్చేలా ఆంక్షలు విధి స్తారు. అంటే వెహికల్ నంబర్ల ఆధారంగా కేటాయించిన రోజుల్లోనే బండ్లు తిరిగేం దుకు పర్మిషన్ ఉంటుంది. నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్‌‌‌‌‌‌‌‌లో చివర్లో సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒకరోజున, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజున రోడ్లపైకి రావాలి. ఈ టైంలో పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్, కార్ పూలింగ్ ద్వారా ప్రయాణాలు చేయవచ్చు. తద్వారా వాహనాల రద్దీ తగ్గి, గాలి కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది.

కమిటీల ఏర్పాటుతో కాలుష్యం ఆగుతదా?: సుప్రీం

కాలుష్యాన్ని అంచనా వేయడానికి జిల్లా స్థాయిలో శాశ్వత నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది విధానపరమైన అంశమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ చెప్పింది. ‘‘దేశవ్యాప్తంగా కమిటీలను ఏర్పాటుచేస్తే కాలుష్యం అంతమవుతుందని అనుకుంటున్నారా?” అని ప్రశ్నించింది. దీంతో పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిల్‌‌‌‌‌‌‌‌ను విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకున్నారు. 


ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

ఢిల్లీలో కాలుష్యానికి మీరంటే మీరు కారణమంటూ ఆప్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకున్నాయి. ‘‘ఢిల్లీలో కాలుష్యానికి హర్యానాలో పంట వ్యర్థాలను కాల్చడమే కారణం. అక్కడున్న బీజేపీ ప్రభుత్వం దీనిని అడ్డుకోవట్లేదు” అని ఆప్ ప్రతినిధి ప్రియాంకా కక్కర్ ఆరోపిం చారు. అయితే, ‘పంజాబ్‌‌‌‌‌‌‌‌ వ్యాప్తంగా ఆదివారం రైతులు 3 వేల చోట్ల పంట వ్యర్థాలు కాల్చారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పొలిటికల్ టూర్లలో బిజీ గా ఉన్నారు’ అని బీజేపీ ఢిల్లీ చీఫ్​ వీరేంద్ర సచ్‌‌‌‌‌‌‌‌దేవా మండిపడ్డారు.