పవిత్ర మాసం 2025... కార్తీకమాసం వచ్చేసింది.. పండుగల వివరాలు ఇవే..!

పవిత్ర మాసం 2025... కార్తీకమాసం వచ్చేసింది..  పండుగల వివరాలు ఇవే..!

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే  కార్తీకమాసం ఈ ఏడాది ( 2025)  అక్టోబర్​ 22 నుంచి ప్రారంభమైంది.  కార్తీక మాసం  తదుపరి వచ్చే అమావాస్య వరకు (నవంబర్ 20) వరకు కొనసాగుతుంది.  శివకేశవులకు అత్యంత ప్రీతి పాత్రంగా ఈ మాసాన్ని చెబుతారు.   ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో వచ్చే పండుగుల గురించి తెలుసుకుందాం. . .

కార్తీకమాసంలో  సూర్యోదయానికి ముందే నదీస్నానం చేసి శివకేశవ పూజలు చేస్తారు. ఈ మాసంలో శివుడికి దీపారాధన చేసి పూజలు చేసిన వారికి విశేషమైన పుణ్యం లభిస్తుందిని.. తద్వారా ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అందుకే చాలా మంది శివ భక్తులు సాయంత్రం వేళ గుడిలో దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

కార్తీకమాసంలో పండుగల వివరాలు

  • అక్టోబర్ 22 : అన్న కూట్, గోవర్ధన్ పూజ, బలి ప్రతిపద పండుగ 
  • అక్టోబర్ 23 :  భాయ్ దూజ్, యమ ద్వితీయ, చిత్రగుప్త పూజ
  • అక్టోబర్25  :  నాగుల చవితి..మాసిక వినాయక చతుర్థి వ్రతం
  • అక్టోబర్26  :  లాభ పంచమి 
  • అక్టోబర్27  :  కార్తీక సోమవారం ,  స్కంద షష్ఠి, ఛత్ పూజ
  • అక్టోబర్29  :  బుధ అష్టమి వ్రతం
  • అక్టోబర్30  : గోపాష్టమి, మాసిక్ దుర్గా అష్టమి
  • అక్టోబర్31  : అక్షయ నవమి, జగద్ధాత్రి పూజ
  • నవంబర్ 1 :  ప్రబోధిని (దేవ్ ఉత్థాని) ఏకాదశి, కంస వధ, భీష్మ పంచకం
  • నవంబర్ 2 :  తులసీ వివాహం, వైష్ణవ దేవుత్థాన ఏకాదశి, యోగేశ్వర ద్వాదశి
  • నవంబర్ 3 :   కార్తీక  సోమ ప్రదోష వ్రతం, వైకుంఠ ,విశ్వేశ్వర వ్రతం,చతుర్దశి
  • నవంబర్4  : మణికర్ణిక స్నానం
  • నవంబర్5  :కార్తీక పూర్ణిమ,దేవ్ దీపావళి, భీష్మపంచకం ముగింపు, గురునానక్ జయంతి,పుష్కర స్నానం
  • నవంబర్ 6: విశాఖ కార్తె ప్రారంభం
  • నవంబర్ 8 : సంకష్టహర చతుర్ధి, సౌభాగ్య సుందరి తీజ్​
  • నవంబర్​ 10: కార్తీక సోమవారం
  • నవంబర్ 12: బుధ అష్టమి
  • నవంబర్ 14: బాలల దినోత్సవం
  • నవంబర్ 15: ఉత్పన్న ఏకాదశి
  • నవంబర్ 16: వృశ్చిక సంక్రమణం
  • నవంబర్ 17 : కార్తీక సోమవారం .. ప్రదోష వ్రతం
  • నవంబర్ 18 : మాస శివరాత్రి
  • నవంబర్ 20 : కార్తీక మాసం చివరి రోజు