తగ్గిన బంగారం, వెండి ధరలు దీవాళీ తర్వాత పరుగులకు బ్రేక్

తగ్గిన బంగారం, వెండి ధరలు దీవాళీ తర్వాత పరుగులకు బ్రేక్

ఎట్టకేలకు బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. దీపావళి ముందు నుంచి పరుగు పెడుతూ సామాన్యులకి చుక్కలు చూపించిన ధరలు ఇవాళ ఒక్కసారిగా పడిపోయాయి. అయితే ఇప్పటికి బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో ఉండడం గమనార్హం. ఇక బంగారం వెండి కొనేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు కస్టమర్లకు రిలీఫ్ దొరికింది. అయితే బంగారం, వెండి ధరలకు తగ్గడానికి ప్రపంచ కారణాలు తోడయ్యాయి. ఒక విధంగా కార్తీకమాసంలో బంగారం, వెండి ధరలు దిగిరావడం కొనుగోలుదారుల్లో కూడా సంతోషం నింపింది.   

 ఇవాళ 24 క్యారెట్ల బంగారం  1గ్రామ ధర రూ. 338 తగ్గి రూ.12,720 తగ్గగా, 22 క్యారెట్ల ధర రూ. 310 తగ్గి రూ.11,660, 18 క్యారెట్ల ధర రూ.254 పడిపోయి రూ. 9,540. 

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,27,200తో రూ3,380 తగ్గింది. 22 క్యారెట్ల  ధర  రూ.3,100 తగ్గి రూ.1,16,600 , 18 క్యారెట్ల ధర రూ.2,540 తగ్గి రూ.95,400. 

ఇక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,27,200, 22 క్యారెట్ల ధర  రూ.1,16,600 , 18 క్యారెట్ల ధర రూ.95,400. 

విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,27,200, 22 క్యారెట్ల ధర రూ.1,16,600, 18 క్యారెట్ల ధర రూ.95,400.  

ఇక వెండి  ధర కూడా నేడు తగ్గింది. ప్రస్తుతం 1 లక్ష 62 వేలు ఉన్న వెండి కేజీ ధర ఇవాళ 2 వేలు తగ్గింది. దింతో వెండి గ్రాము ధర రూ.2 తగ్గి రూ.162 ఉండగా,  కేజీ ధర 2 వేలు తగ్గి రూ.1 లక్ష 62 వేలుగా ఉంది.