
ఢిల్లీ: భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. జావెలిన్ త్రో యరు భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదా లభించింది. టోక్యో ఒలింపి క్స్ లో తొలి బంగారు పతకం గెలుచుకున్న నీరజకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది లెఫ్టినెం ట్ కల్నల్ హోదాతో సత్కరించారు.
ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా తొలుత సుబే దార్గా 2016లో జాయిన్ అయ్యారు. 2021లో మేజర్గా ప్రమోషన్ పొందారు. 2022లో 'పరమ విశిష్ట సేవా పతకం'తో కేంద్రం సత్కరించింది. ఇప్పుడు మేజర్ నుంచి లెఫ్టినెంట్ కర్నల్ హోదా అందుకొన్నారు. మరోవైపు భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన చంద్ ఖేల్త్న పురస్కారాన్ని 2021లో అం దుకున్న నీరజ్ చోప్రా.. 2022లో పద్మశ్రీ అవార్డును పొందారు.<