బీ అలర్ట్ : ATM నుంచి డబ్బులు వచ్చే దగ్గర ప్లాస్టిక్ అట్టలు

బీ అలర్ట్ : ATM నుంచి డబ్బులు వచ్చే దగ్గర ప్లాస్టిక్ అట్టలు

ముంబై ఆమ్ ఆద్మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రూబెన్ మస్కరెన్హాస్ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా ATM స్కామ్‌ వెలుగులోకి వచ్చింది.  అంధేరీలోని చకాలలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ATM వద్ద క్యాప్చర్ చేయబడిన ఈ వీడియోలో ATMలో నుంచి డబ్బులు రాకుండాస్కామర్లు ఉపయోగించే ట్రిక్ ను చూపిస్తుంది.  

ATMలో నుంచి వచ్చే డబ్బు బయటకు రాకుండా స్కామర్‌లు ఓ ప్లాస్టిక్ స్ట్రిప్ ను అతికించారు.  ఎవరైనా డబ్బులు డ్రా చేయాలనుకుంటే  మిషిన్ పనిచేస్తుంది కానీ అందులోంచి డబ్బులు బయటకు రావు. దీంతో మిషిన్ పనిచేయడం లేదు అనుకుని కస్టమర్లు అక్కడి నుండి వెనుదిరిగి వెళుతారు.  అ టైమ్ లోనే స్కామర్లు ఆ  ATM వద్ద ఉన్న   ప్లాస్టిక్ స్ట్రిప్ ను తొలిగించి డబ్బులను తీసుకెళ్తారు.   ఈ ఘరనా మోసంపై   రూబెన్ మస్కరెన్హాస్  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

ఇలాంటి స్కామ్ లు దేశంలో కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా సార్లు జరిగాయి.  ఉత్తరప్రదేశ్ లోని  ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇలాంటి మోసాలకు పాల్పడితే వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.  29 వేలు స్వాధీనం చేసుకున్నారు.  వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.