ఒక్క కేజ్రీవాల్ ను జైల్లో పెడితే ..వేల మంది కేజ్రీవాల్ లు పుట్టుకొస్తారు: మంత్రి

ఒక్క కేజ్రీవాల్ ను జైల్లో పెడితే ..వేల మంది కేజ్రీవాల్ లు పుట్టుకొస్తారు: మంత్రి

ఒక్క కేజ్రీవాల్ ను జైల్లో పెడితే వేల మంది కేజ్రీవాల్ లు పుట్టుకొస్తారన్నారు ఢిల్లీ మంత్రి అతిషీ. కేజ్రీవాల్ ఒక వ్యక్తి మాత్రేమే కాదని, ఆయన ఒక ఆలోచన అని చెప్పారు. కేజ్రీవాల్ స్ఫూర్తిని విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు.  ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారన్నారు తెలిపారు. రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితేనే పదవికి రాజీనామా చేయాలని చట్టంలో ఉందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా, మోదీ సర్కార్ కుట్రతో కేజ్రీవాల్ పై కేసు పెట్టారని ఆరోపించారామె. కేజ్రీవాల్ స్ఫూర్తి దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరేందుకు సోషల్ మీడియాలో డీపీ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి అషితి చెప్పారు.

కాగా, ఈడీ ఆఫీసులో కేజ్రీవాల్ విచారిస్తున్నారు. ముఖ్యంగా వందకోట్ల ముడుపులు, సౌత్ లాబీయింగ్ తో జరిపిన చర్చలకు సంబంధించిన వివరాలపైనే ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఫోన్ రికార్డింగ్స్ తోపాటు అన్ని ఆధారాలను ముందుంచి కేజ్రీవాల్ ను ప్రశ్నించినట్లు సమాచారం. 28 మధ్యాహ్నం వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు కేజ్రీవాల్. ప్రతిరోజు ఈడీ ప్రధాన కార్యాలయానికి వచ్చి కేజ్రీవాల్ ను కలిసి వెళుతున్నారు ఆయన సతీమణి.

Also Read: ఆన్ లైన్ లో నామినేషన్స్.. ఎక్కడి నుంచైనా దాఖలుకు చాన్స్