ఆన్ లైన్ లో నామినేషన్స్.. ఎక్కడి నుంచైనా దాఖలుకు చాన్స్

ఆన్ లైన్ లో నామినేషన్స్..  ఎక్కడి నుంచైనా దాఖలుకు చాన్స్

ఢిల్లీ: నామినేషన్ కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటం.. చివరి రోజు అభ్యర్థులు ఒక్కసారిగా పోటెత్తడం.. కొద్ది నిమిషాల ముందు అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు పరుగులు తీయడం.. ఇవన్నీ మర్చిపోండి అంటోంది భారత ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఎంచక్కా ఆన్ లైన్ లోనే నామినేషన్ వేసేయాలని చెబుతోంది. సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతోంది మన సీఈసీ. ప్రస్తుతం ఏడు దశల్లో జరగనున్న పార్లమెంటు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఆన్ లైన్ ద్వారా నామినేషన్లను స్వీకరిస్తోంది. 

ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ లో https://suvidha.eci.gov.in/pc/public/login ద్వారా నామినేషన్ ఫారం పూర్తి చేయాలి. ఆ తర్వాత రిటర్నింగ్ అధికారి అందించిన సమాచారంలో సూచించిన స్థలంలో దాని ప్రింట్ అవుట్ తీసుకొని ఫార్మాట్-1లో తమ నామినేషన్‌ను సమర్పించవచ్చు.  అఫిడవిట్‌ను  లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పూరించవచ్చు. ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత దానిని నోటరీ చేసి రిటర్నింగ్ అధికారి ముందు దాఖలు చేయాలి. నామినేషన్ ఫారమ్‌ను విజయవంతంగా సమర్పించిన తర్వాత, సెక్యూరిటీ డబ్బును డిపాజిట్ చేసే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా డిపాజిట్ సొమ్మను ఆన్ లైన్ ద్వారా చెల్లించవచ్చు.