ఒలంపిక్స్ ను బహిష్కరించాలి.. పిలుపునిచ్చిన ప్రముఖులు..

ఒలంపిక్స్ ను బహిష్కరించాలి.. పిలుపునిచ్చిన ప్రముఖులు..

పారిస్ ఒలంపిక్స్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఫైనల్ కు చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మెడల్ సొంతం చేసుకుంటుందని అంతా ఎదురుచూస్తున్న క్రమంలో  ఊహించని షాక్ తగిలింది. వినేశ్ ఫోగాట్ 100గ్రాములు బరువు అధికంగా ఉందంటూ ఆమెపై అనర్హత వేటు పడింది.

ఈ అంశంపై దేశవ్యాప్తంగా బాయ్ కాట్ ట్రెండ్ మొదలైంది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, మాజీ రన్నర్ పీటీ ఉష కీలక వ్యాఖ్యలు చేశారు. ఒలంపిక్స్ ను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు వేయటం దేశానికే అవమానం అని అన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాయ్కాట్ ఒలంపిక్స్ అన్న ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్.