
ఆమ్ ఆద్మీ పార్టీ ఈశాన్య రాష్ట్రాలపైనా దృష్టి సారించింది. ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాగాలాండ్ లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే అసు కీహోకు ఆప్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పినట్లు పార్టీ ఇంఛార్జ్ రాజేశ్ శర్మ ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సైతం ఆప్ ప్రభుత్వాన్ని కోర్కుంటున్నారని చెప్పారు. 2018 నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. 60 మంది సభ్యులున్న నాగాలాండ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 27న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 02న ఫలితాలు వెలువడుతాయి.