పౌడర్‌కు 18% .. పిండికి 5% జీఎస్టీ

పౌడర్‌కు 18%  .. పిండికి 5% జీఎస్టీ
  • ఇన్‌‌స్టంట్‌‌ ఫుడ్‌‌ కు జీఎస్టీపై ఏఏఆర్‌‌ వివరణ 
     

న్యూఢిల్లీ:  పౌడర్‌‌ రూపంలో అమ్మే రెడీ -టు -కుక్ దోసె, ఇడ్లీ, పారిడ్జ్ మిక్స్ వంటి ఇన్‌‌స్టంట్‌‌ ఫుడ్స్‌‌పై 18 శాతం జీఎస్టీ కట్టాల్సిందేనని అథారిటీ ఆఫర్ అడ్వాన్స్‌‌ రూలింగ్‌‌ చెన్నై బెంచ్‌‌ తీర్పు చెప్పింది. రుబ్బినపిండి రూపంలో అమ్మితేనే జీఎస్టీ  5 శాతంగా ఉంటుందని తెలిపింది.  తమ ఇన్​స్టంట్​ ఫుడ్స్​పై జీఎస్టీ రేటు గురించి క్లారిటీ ఇవ్వాలని కోరుతూ కృష్ణ భవన్ ఫుడ్స్ అండ్ స్వీట్స్.. అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్)  తమిళనాడు బెంచ్‌‌లో కేసు వేసింది. ఈ సంస్థ ప్రొడక్టులన్నీ పౌడర్‌‌ రూపంలో ఉన్నాయి కాబట్టి 18 శాతం జీఎస్టీ కట్టాలని స్పష్టం చేసింది.