వార్నర్ అయితేనే మేలు జరుగుతుంది

వార్నర్ అయితేనే మేలు జరుగుతుంది

ఆరోన్ ఫించ్ వీడ్కోలతో ఆస్ట్రేలియా వన్డే టీమ్ కెప్టెన్గా బోర్డు ఎవరిని నియమిస్తుందన్న  ఆసక్తి నెలకొంది. రేసులో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మాక్స్వెల్, టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉన్నారు. ఈనేపథ్యంలో మాజీ సారథి ఫించ్..వన్డే కెప్టెన్ ఎంపికపై కీలక వాఖ్యలు చేశాడు. 

స్మిత్ కంటే వార్నర్ బెటర్.. 
ఆస్ట్రేలియా వన్డే సారథిగా డేవిడ్ వార్నరే బెటరని..ఫించ్ అన్నాడు. కెప్టెన్ వార్నర్ కు సాటిలేరని..అతన్నే వన్డే కెప్టెన్ గా ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డాడు. వార్నర్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా పునరాలోచన చేస్తుందని అనుకుంటున్నట్లు చెప్పాడు.  గతంలో వార్నర్ సారథ్యంలో తనకు అవకాశం వచ్చిందన్నాడు. వార్నర్ అద్భుతమైన సారథి అని మెచ్చుకున్నాడు.  గ్రౌండ్ లో అతని వ్యూహాలు, పరిస్థితులకు తగ్గట్లు తీసుకునే నిర్ణయాలు అసాధారణంగా ఉంటాయని కొనియాడాడు.  ఆటగాళ్లు సైతం అతని సారథ్యంలో ఆడేందుకు  ఇష్టపడుతారన్నాడు. 

వార్నర్‌పై నిషేధం..
2018లో బాల్ టాంపరింగ్ ఉదంతంతో వార్నర్ పై క్రికెట్ ఆస్ట్రేలియా జీవిత కాలం కెప్టెన్ కాకుండా నిషేధం విధించింది. అయితే ఈ నిషేధంపై పునరాలోచించాలని..మాజీ క్రికెటర్లు, వార్నర్ వైఫ్ క్రికెట్ ఆస్ట్రేలియాను కోరుతుంది. ఇప్పటికే వార్నర్ చేసిన తప్పిదానికి శిక్ష కూడా అనుభవించాడని..ఇంకా అతనిపై వివక్ష చూపించొద్దని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వార్నర్ కు మద్దతుగా ఫించ్ మాట్లాడటం చర్చనీయాంశమైంది. 

ఫింఛ్ కెరీర్..
ఆరోన్ ఫించ్.. ఆస్ట్రేలియా తరపున 146 వన్డేలు ఆడాడు. మొత్తం 5046 పరుగులు సాధించాడు. ఇందులో 17 సెంచరీలు,30 హాఫ్ సెంచరీలున్నాయి. 52 వన్డేల్లో ఆసీస్‌కు  కెప్టెన్‌గా వ్యవహారించిన ఫించ్..28 విజయాలు అందుకున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌ చేరింది. ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో 2021 టీ20 వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా గెలిచింది. అంతేకాకుండా  కెప్టెన్‌గా టీ20ల్లో 65 మ్యాచులు ఆడి 35 విజయాలు అందుకున్నాడు.