రెండు వేరియేషన్స్‌‌‌‌‌‌‌‌లో రెబల్‌‌‌‌‌‌‌‌గా..

రెండు వేరియేషన్స్‌‌‌‌‌‌‌‌లో రెబల్‌‌‌‌‌‌‌‌గా..

‘అమిగోస్‌‌‌‌‌‌‌‌’తో టాలీవుడ్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ ఇచ్చిన ఆషిక రంగనాథ్‌‌‌‌‌‌‌‌.. సంక్రాంతికి నాగార్జునకు జంటగా ‘నా సామిరంగ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈచిత్రం జనవరి 14న విడుదలవుతున్న సందర్భంగా ఆషిక మాట్లాడుతూ ‘ఇందులో వరాలు అనే పాత్రలో కనిపిస్తా. పల్లెటూరి అమ్మాయి అనగానే సున్నితంగా ఉండే పాత్రలు ఎక్కువ వస్తాయి. కానీ ఇందులో నా పాత్ర రెబల్‌‌‌‌‌‌‌‌. చాలా స్వతంత్ర భావాలు కలిగిన  అమ్మాయి. రెండు వేరియేషన్స్‌‌‌‌‌‌‌‌లో ఉండే నా పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సినిమా చూశాక అమ్మాయి అంటే ఇలా ఉండాలనే భావన కలిగిస్తుంది.

తప్పకుండా ఈ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందరినీ అలరిస్తుందని ఫుల్‌‌‌‌‌‌‌‌ కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాను. ఇక కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలోనే నాగార్జున గారి లాంటి బిగ్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నటించడం నా అదృష్టం. నాగార్జున గారితో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతి. ఆయన చాలా స్వీట్ పర్సన్. కథ ప్రకారం మా ఇద్దరి పాత్రల మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అలాగే నరేష్, రాజ్ తరుణ్‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో చేసిన సీన్స్ చక్కని వినోదాన్ని పంచుతాయి.

ఇది తెలుగుదనం ఉట్టిపడే పక్కా కమర్షియల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. విజయ్ బిన్నీ ఎంతో క్లారిటీగా, అనుభవం ఉన్న దర్శకుడిలా తీర్చిదిద్దారు. ఇక తమిళంలో సిద్ధార్ద్‌‌‌‌‌‌‌‌తో ఒక సినిమా, అలాగే కన్నడలో రెండు సినిమాలు జరుగుతున్నాయి. గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు నటనకు ఆస్కారమున్న పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. పీరియాడిక్ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ చేయాలని, ఎప్పటికైనా రాజమౌళి గారి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో నటించాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది.