టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆషికా రంగనాథ్

టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆషికా రంగనాథ్

కన్నడలో పదికిపైగా చిత్రాల్లో నటించి హీరోయిన్‌‌‌‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కళ్యాణ్ రామ్ నటిస్తోన్న ‘అమిగోస్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం కాబోతోంది. ఇందులో ‘ఇషిక’ పాత్రలో నటిస్తోందని ఆమె క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు  ఫస్ట్ లుక్‌‌‌‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో ఆషిక క్యూట్ లుక్స్‌‌‌‌తో ఇంప్రెస్ చేస్తోంది. టాలీవుడ్ ఆడియెన్స్‌‌‌‌ని కచ్చితంగా ఆమె ఆకట్టుకుంటుందన్నారు మేకర్స్. 

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందని  చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఆషిక మరో రెండు కన్నడ చిత్రాల్లో  కూడా నటిస్తోంది.