హనుమాన్ మ్యూజిక్ తొలి ఆడియోగా ఆత్మకథ 

హనుమాన్ మ్యూజిక్ తొలి ఆడియోగా ఆత్మకథ 

జెమిని సురేష్, రూప జంటగా శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో  అర్థం వారాహి సోమేష్ నిర్మించిన చిత్రం ‘ఆత్మకథ’.  తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు.  హనుమాన్ మ్యూజిక్ లేబుల్‌‌‌‌ ద్వారా విడుదలైన తొలి ఆడియోను  సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె విడుదల చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

ఈ చిత్రం తమకు మంచి పేరు తీసుకొస్తుందని టీమ్ నమ్మకం వ్యక్తం చేసింది.  సమ్మెట గాంధీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్, ధనరాజ్, నాగ మహేష్  కీలక పాత్రలు పోషించారు.   శ్రేయాంశ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి గోపి సినిమాటోగ్రఫీ, రాఘవేంద్ర రెడ్డి ఎడిటింగ్ నిర్వహించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రం విడుదల కానుంది.