WTC Final 2025: ఐపీఎల్‌లో అలా.. దేశానికి ఇలా: పార్టీ మార్చేసిన డివిలియర్స్

WTC Final 2025: ఐపీఎల్‌లో అలా.. దేశానికి ఇలా: పార్టీ మార్చేసిన డివిలియర్స్

సౌతాఫ్రికా మాజీ కెప్టెన్.. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో కామెంట్రీ చేస్తూ బిజీగా మారాడు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య బుధవారం (జూన్ 11) టెస్ట్ ఛాంపియన్ షాప్ ఫైనల్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో డివిలియర్స్ కామెంట్రీ చేస్తూ తన సొంతం దేశం సౌతాఫ్రికాకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం ఐపీఎల్ లో ఒక బౌలర్ వికెట్ తీస్తే సంతోషపడిన డివిలియర్స్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం అదే బౌలర్ వికెట్ తీయగానే నిరాశకు గురయ్యాడు. అతడెవరో కాదు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్. 

ఐపీఎల్ 2025 లో హేజల్ వుడ్ రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడి జట్టుకు టైటిల్ తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించాడు. డివిలియర్స్ ఐపీఎల్ లో ఎక్కువ సీజన్ లు ఆర్సీబీ తరపున ఆడడంతో ఆ జట్టుకు ప్రతి సీజన్ లో సపోర్ట్ చేస్తూ ఉంటాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో హేజల్ వుడ్ పంజాబ్ తొలి వికెట్ తీసి బ్రేక్ ఇచ్చాడు. ఆ సమయంలో కామెంట్రీ బాక్స్ లో కూర్చున్న డివిలియర్స్ పట్టరాని సంతోషంతో చప్పట్లు కొట్టాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో సీన్ రివర్స్ అయింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో భాగంగా సఫారీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ ను హేజల్ వుడ్ ఒక అద్భుతమైన ఇన్ స్విన్గర్ తో క్లీన్ బౌల్డ్ చేశాడు. 

►ALSO READ | WTC Final 2025: ఛాన్స్ దక్కకున్నా చిల్: డబ్ల్యూటీసీ ఫైనల్ ఎంజాయ్ చేస్తున్న భారత యువ క్రికెటర్

ఈ సమయంలో డివిలియర్స్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. స్టబ్స్ ఔట్ కావడంతో సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.  వారం క్రితం ఆసీస్ బౌలర్ ను సపోర్ట్ చేసిన డివిలియర్స్.. టెస్ట్ ఛాంపియన్ షిప్ లో హేజల్ వుడ్ వికెట్స్ తీయకూడదని కోరుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ ఫైనల్లో నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ కాగా..సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 57.1 ఓవర్లలో 138 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. ఫలితంగా ఆసీస్‌‌‌‌కు 74 రన్స్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌‌‌‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ఆట ముగిసే టైమ్‌‌‌‌కు 40 ఓవర్లలో 144/8 స్కోరు చేసింది. ప్రస్తుతం కంగారూలు 218 రన్స్‌‌‌‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.