AB De Villiers: అలా జరిగితే నేను RCB మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వస్తాను: ఏబీ డివిలియర్స్

AB De Villiers: అలా జరిగితే నేను RCB మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వస్తాను: ఏబీ డివిలియర్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ స్టార్ బ్యాటర్ డివిలియర్స్, విరాట్ కోహ్లీ ,మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లతో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించేవారు. వీరిద్దరి కాంబినేషన్ లో బెంగళూరు జట్టు అత్యత్తమంగా ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ కొట్టలేకపోయింది. 2016లో జట్టు ఫైనల్ కు వచ్చినా సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో తృటిలో ట్రోఫీ చేజార్చుకుంది. మళ్ళీ మరోసారి ఈ సీజన్ లో ఆర్సీబీ ట్రోఫీ అందుకుంటుందనే ఆశను కలిగిస్తుంది. 

జట్టులో ప్లేయర్లందరూ ఫామ్ లో ఉండగా .. కోహ్లీ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా కప్ కొడుతుందని ఫ్యాన్స్ తో డివిలియర్స్ కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సపోర్ట్ చేసే ఈ సౌతాఫ్రికా సూపర్ స్టార్ ఈ సారి ఆర్సీబీ ఫైనల్ కు వస్తే మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వస్తానని చెప్పాడు. "ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకుంటే, నేను స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూస్తాను. విరాట్ కోహ్లీతో కలిసి ట్రోఫీని ఎత్తడం కంటే నాకు మరేమీ ఆనందం ఇవ్వదు. నేను చాలా సంవత్సరాలుగా ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను".అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. 

"విరాట్ నా క్రికెట్ సోదరులలో ఒకడు. నేను అతనిని బాగా తెలుసుకున్న తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తిగా మారాడు. కోహ్లీతో ఆడేందుకు చాలా ఇష్టపడతాను. అతను చాలా మంచివాడు. పోటీతత్వం కలవాడు. అతనిలో నన్ను నేను చూసుకున్నాను". అని డివిలియర్స్ అన్నాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ ఆడిన 11 మ్యాచ్ ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న పటిదార్ సేనతర్వాత జరగబోయే మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. కనీసం రెండు మ్యాచ్ లు గెలిచినా ప్లే టాప్-2 లో ఉండే అవకాశం ఉంది. 

►ALSO READ | Cricket West Indies: వెస్టిండీస్ క్రికెట్ షాకింగ్ నిర్ణయం.. రెండేళ్లు టెస్ట్ ఆడకపోయినా కెప్టెన్సీ బాధ్యతలు

డివిలియర్స్ 2021 క్రికెట్ లో అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2018, ఫిబ్రవరిలో సౌతాఫ్రికా తరఫున చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన ఏబీడీ.. అదే ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ప్రొటీస్‌ జట్టుకు ఆఖరుసారి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో డివిలియర్స్ 5 వేలకు పైగా పరుగులు చేయడం విశేషం. ఇక అంతర్జాతీయ క్రికెట్‌ విషయానికొస్తే.. 114 టెస్టుల్లో 8,765 రన్స్, వన్డేల్లో 228 మ్యాచ్‌లు ఆడి 9,577 పరుగులు చేశాడు. ఇక టీ20 ల్లో 78 మ్యాచుల్లో 1,672 పరుగులు చేశాడు.