
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఈ లీగ్ లో ఈ సఫారీ ఆటగాడి విధ్వంసానికి తిరుగు లేకుండా పోతుంది. 41 బంతుల్లోనే ఇంగ్లాండ్ ఛాంపియన్స్ సెంచరీ కొట్టి తనలోని అట ఇంకా మిగిలే ఉందని నిరూపించాడు. అంతకముందు టీమిండియాపై హాఫ్ సెంచరీ చేసి ఈ లీగ్ లో అదరగొట్టేస్తున్నాడు. టోర్నీలో భాగంగా మ్యాచ్ తర్వాత ఇటీవల ప్రెజెంటర్ షెఫాలీ బగ్గాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ తన మనసులోని ఇష్టమైన క్రికెటర్లు ఎవరో తెలిపాడు. ఈ ఇంటర్వ్యూలో కోహ్లీ కింగ్ కాదని చెప్పి షాక్ ఇచ్చాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 లో సౌతాఫ్రికా ఛాంపియన్స్‌కు కెప్టెన్సీ చేస్తున్న డివిలియర్స్.. దిగ్గజ క్రికెటర్ల పట్ల తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మొదట 'కింగ్' అనే పదం ఎవరికి ఇస్తారు అని అడిగినప్పుడు కోహ్లీ కాకుండా తన దేశానికి చెందిన 'కల్లిస్' అని చెప్పాడు. 'రన్ మెషిన్' కోసం ఎవరు అడిగినప్పుడు వెంటనే విరాట్ కోహ్లీ పేరు చెప్పాడు. ఈ సందర్భంగా ఐపీఎల్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కోహ్లీతో ఆడడాన్ని గుర్తు చేసుకున్నాడు.
'మిస్టర్ కన్సిస్టెంట్' అనే పదం స్టీవ్ స్మిత్ కు ఇచ్చాడు. 'స్పీడ్' గురించి ప్రస్తావించినప్పుడు, డివిలియర్స్ పాకిస్తాన్ 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయబ్ అక్తర్ అని చెప్పాడు. తనను తాను 'గోల్డెన్ ఆర్మ్' అని చెప్పుకున్నాడు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) అనే ప్రస్తావన వచ్చినప్పుడు డివిలియర్స్ కల్లిస్ పేరును చెప్పాడు. ఏబీ డివిలియర్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కెరీర్ లో టాప్ లో ఉన్న ఉన్న ఈ సౌత్ ఆఫ్రికా విధ్వంసకర బ్యాటర్ 34 ఏళ్ళకే క్రికెట్ గుడ్ బై చెప్పడం ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరించింది.
2018, ఫిబ్రవరిలో సౌతాఫ్రికా తరఫున చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన ఏబీడీ.. అదే ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ప్రొటీస్ జట్టుకు ఆఖరుసారి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో డివిలియర్స్ 5 వేలకు పైగా పరుగులు చేయడం విశేషం. ఇక అంతర్జాతీయ క్రికెట్ విషయానికొస్తే.. 114 టెస్టుల్లో 8,765 రన్స్, వన్డేల్లో 228 మ్యాచ్‌లు ఆడి 9,577 పరుగులు చేశాడు. ఇక టీ20 ల్లో 78 మ్యాచుల్లో 1,672 పరుగులు చేశాడు.
@ABdeVilliers17 faces the heat in a high-speed, rapid-fire round, quick questions, quicker answers, no time to think! 🔥#WCL2025 👉 18th July to 2nd August, Every day Live on Star Sports Network pic.twitter.com/9q8YpfM1Mr
— Star Sports (@StarSportsIndia) July 25, 2025