రంగారెడ్డి జిల్లాలో ఏబీడీ పెట్ బాట్లింగ్ యూనిట్‌‌ ప్రారంభం

రంగారెడ్డి జిల్లాలో ఏబీడీ పెట్ బాట్లింగ్ యూనిట్‌‌ ప్రారంభం
  • రూ. 115 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్, వెలుగు:  ఆఫీసర్స్​ ​చాయిస్​, జోయా బ్రాండ్ల పేరుతో ఆల్మహాల్​అమ్మే దేశీయ స్పిరిట్స్ కంపెనీ ఆల్లాయిడ్​ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ లిమిటెడ్ (ఏబీడీ), తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, రంగపూర్​లో తన ఇంటిగ్రేటెడ్ తయారీ కేంద్రంలో పెట్ బాటిల్ తయారీ యూనిట్​ను ప్రారంభించింది. రూ. 115 కోట్లు పెట్టుబడితో స్థాపించిన ఈ ప్లాంట్​ వార్షిక సామర్థ్యం 600 మిలియన్ బాటిళ్లు. 

ఇది ఏబీడీ ప్యాకేజింగ్ అవసరాలను తీరుస్తుంది.  లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించి, లాభదాయకతను పెంచుతుంది. ఈ కేంద్రంలో ఈఎన్ఏ డిస్టిలరీ, ఐఎంఎఫ్ఎల్ బాట్లింగ్ యూనిట్, సింగిల్ మాల్ట్ ప్లాంట్ కూడా ఉన్నాయి. ఈ పెట్ యూనిట్​కు అధునాతన ఆటోమేషన్ టెక్నాలజీ ఉంది. 

ఈ సందర్భంగా ఏబీడీ ఎండీ అలోక్ గుప్తా మాట్లాడుతూ, తమ రూ. 525 కోట్ల బ్యాక్‌‌వర్డ్ ఇంటిగ్రేషన్ కార్యక్రమాలలో ఈ యూనిట్​ ఒక భాగమని, దీని ద్వారా 2028 ఆర్థిక సంవత్సరం నాటికి గ్రాస్​ మార్జిన్లు సుమారు 300 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని చెప్పారు. ‘‘భారతదేశం నుంచి మేం అతిపెద్ద ఆల్కహాల్​ఎగుమతిదారులం. 2024 వరకు, మేం 17 దేశాలకు ఎగుమతి చేశాం. ఇప్పుడు 27 దేశాలకు పెంచాం.  త్వరలో 35 దేశాలకు విస్తరిస్తాం”అని వివరించారు. ఏబీడీకి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,541 కోట్ల ఆదాయం వచ్చింది.