ఆఫ్ఘనిస్తాన్ లో భారత సంతతి వ్యాపారి కిడ్నాప్

ఆఫ్ఘనిస్తాన్ లో భారత సంతతి వ్యాపారి కిడ్నాప్

కాబుల్ : తాలిబన్లు భారత సంతతికి చెందిన 50 ఏళ్ల ఆఫ్ఘానిస్తాన్ వ్యాపారి బన్సారిలాల్ అరెండేను కిడ్నాప్ చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తన షాప్ కు వెళ్లేందుకు కారులో బయలుదేరున్న బన్సారిలా ను కర్తే పర్వాన్‌ ప్రాంతం నుండి సాయుధులైన దుండగులు వచ్చి అడ్డుకున్నారు. తుపాకీ గురిపెట్టి తమతో రావాలని తీసుకెళ్లినట్లు  దుండగులు కిడ్నాప్ చేసినట్లు అకాలీదళ్‌ నేత మణ్జిందర్‌ సింగ్‌ శిర్సా ట్వీట్‌ చేసి వెల్లడించారు. కిడ్నాప్ కు గురైన బన్సూరీ లాల్‌ ఓ చిన్న వ్యాపారస్తుడే తప్ప పెద్ద ధనవంతుడేమీ కాదని సమాచారం.
 భారత సంతతి ఆఫ్ఘన్ పౌరుడ్ని కిడ్నాప్ చేసిన విషయంపై కాబూల్‌లో ఉన్న హిందూ సిక్కుల కుటుంబాలతో ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ ప్రెసిడెంట్‌ మణ్జింజిందర్‌ మాట్లాడారు. బన్సారీలాల్‌.. తన గోడౌన్ వెళుతుండగా.. ఐదుగురు దుండగులు.. తుపాకులను చూపించి, చంపేస్తామని బెదిరించి.. కారులోకెక్కించి.. బలవంతంగా కిడ్నాప్‌ చేశారని తెలిపారు. బాధితుడి కుటుంబానికి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అంటూ ఓ వీడియో స్టేట్‌మెంట్‌ను  మన్‌జిందర్‌ విడుదల చేశారు. ఈ వీడియోను ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ట్యాగ్‌ చేశారు. 
బారత సంతతి వ్యాపారి కిడ్నాప్ కు సంబంధించిన విషయాన్ని తొలుత పునీత్‌ సింగ్‌ చాంధోక్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేయడంతో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తనను తాను ఇండియన్‌ వరల్డ్‌ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌గా పేర్కొన్న పునీత్ సింగ్ ఛాంధోక్ చెప్పుకున్నారు. అయితే కిడ్నాప్ గురించి తెలియదని.. ఆ కుటుంబం ఢిల్లీలో ఉంటున్నారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఆఫ్ఘానిస్తాను తాలిబన్లు కైవసం చేసుకున్న నాటి నుండి అరాచకం చెలరేగుతున్న విషయం తెలిసిందే. పాలన మొత్తం సంక్షోభవంలో కూరుకుపోయింది. చాలా మంది దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 
కిడ్నాప్ ఉదంతంపై తాలిబన్ అధికారులు, పోలీసులు స్పందించారు. తుపాకులు ధరించి కిడ్నాప్ చేసిందెవరో తెలియదని.. వారిని పట్టుకుని శిక్షిస్తామని తాలిబన్ అధికారులు ప్రకటించారు.