
కరాచీ: వన్డేల్లో వరల్డ్ నంబర్‌వన్ బౌలర్, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన ముందు బచ్చాగాడు అంటూ పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ నోరుపారేసుకున్నాడు. 40 ఏళ్ల రజాక్ పాక్ తరఫున 46 టెస్ట్‌లు, 265 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. మెక్ గ్రాత్, వసీమ్ అక్రమ్ లాంటి గ్రేట్ బౌలర్లను ఎదుర్కొన్న తన ముందు బుమ్రా బచ్చాగాడని రజాక్ అన్నాడు. బుమ్రా బౌలింగ్‌ను సింపుల్‌గా ఆడేస్తానన్న రజాక్ అటాక్ కూడా చేస్తానని తెలిపాడు. పైగా జస్ప్రీత్ పైనే ఒత్తిడి ఉంటుందన్నాడు. అయితే విలక్షణ బౌలింగ్ యాక్షన్‌తో పాటు సీమ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్లే బుమ్రా మ్యాచ్‌ను ప్రభావితం చేస్తున్నాడని రజాక్ అభిప్రాయపడ్డాడు.