అబ్దుల్లాపూర్ మెట్ అత్యాచారం, హత్యకు ముందే ప్లాన్

V6 Velugu Posted on Nov 25, 2021

మహిళ అత్యాచారం హత్య కేసును పోలీసులు చేధించారు. గత రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారమతి పేట్ లో ఓ మహిళపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేసి నిందితులు పరారయ్యారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితుల్ని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి పాల్పడింది అదే గ్రామానికి చెందిన దేవరాయ సురేష్(30),బొడిగే శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై పక్కా ప్లాన్ ప్రకారమే లైంగిక దాడి చేసి బంగారం దోచుకొని హత్యచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె భర్తను కూడా పక్క ఊరికి తీసుకెళ్లి అతిగా మద్యం తాగించి హత్య చేయాలని నిందితులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే వారి ప్రవర్తనలో మార్పు కనిపించడంతో అనుమానంతో మృతురాలి భర్త మల్లేష్ వారి నుంచి తప్పించుకున్నాడు. దీంతో నిందితులు మల్లేష్ ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఆమె మెట్టలు, చెవికమ్మలు, 25 తులాలు పట్ట గొలుసులు కూడా చోరీ చేశారు. 

నిందితులుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 302,376D,382 R/w 201 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించారు. గ్రామ శివారులో ఈ ఇద్దరు మద్యం  తాగుతున్న వీరు అటుగా వెలుతున్న అండాలును చూసి అత్యాచారం, హత్య చేయాలని భావించారు. ఆమె వద్ద ఉన్న ఆభరణాలు దోచేయాలని  ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే హత్య చేసేటప్పుడు ఎక్కడ కూడా ఆధారాలు దొరకకుండా నిందితులు జాగ్రత్త పడినట్లు కూడా తెలిపారు. ఎక్కడ కూడా ప్రింగర్ ప్రింట్స్ దొరకకుండా నిందితులు ప్లాన్ చేసుకున్నారన్నారు పోలీసులు. 

Tagged abdullapurmet murder, woman rape murder, abdullapurmet woman rape

Latest Videos

Subscribe Now

More News