తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతున్న పథకాలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి అభయ హస్తం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ దరఖాస్తులను రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వార్డులు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లు, ప్రజా పాలన గ్రామ సభల్లో ఉచితంగా అందిస్తున్నారు. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు స్వయంగా వెల్లడించారు.
డిసెంబర్ 28వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావటంతో ఈ సేవ కేంద్రాలు, పంచాయితీ ఆఫీసుల దగ్గర రద్దీ పెరిగింది. కొందరు అభయ హస్తం దరఖాస్తులకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఒక్కో అప్లికేషన్ కు 30 నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారన్న వార్తలతో అధికారులు స్పందించారు. ఉచితంగా ఇచ్చే అప్లికేషన్ అని.. ఎవరూ డబ్బులు చెల్లించొద్దని.. ప్రభుత్వ ఆఫీసుల్లో వీటిని ఉచితంగా అందిస్తారని వెల్లడించారు అధికారులు.
డౌన్ లోడ్ చేసుకోండి : ప్రజా పాలన అభయ హస్తం అప్లికేషన్ ఇదే
అభయ హస్తంకు కావాల్సిన వివరాలు :
>>> ఆధార్ కార్డు నెంబర్, జిరాక్స్ కాపీ
>>> రేషన్ కార్డు నెంబర్, జిరాక్స్ కాపీ
>>> ఫోన్ నెంబర్
>>> గ్యాస్ కనెక్షన్ నెంబర్, కంపెనీ పేరు
>>> మీ భూమి పాస్ పుస్తకం నెంబర్, సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలు
>>> కరెంట్ మీటర్ నెంబర్
>>> అమరవీరులు, ఉద్యమకారులు అయితే డెత్ సర్టిఫికెట్, FIR నెంబర్, జైలు, శిక్ష వివరాలు
