అభీఅష్యూర్డ్​ పథకాన్ని మరింత విస్తరించిన అభీబస్

అభీఅష్యూర్డ్​ పథకాన్ని మరింత విస్తరించిన అభీబస్

హైదరాబాద్​, వెలుగు: ఇక్సిగో గ్రూప్​నకు చెందిన ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ బస్-టికెటింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ అయిన అభీబస్​ఇటీవల ప్రవేశపెట్టిన అభీఅష్యూర్డ్​ పథకాన్ని మరింత విస్తరించినట్టు ప్రకటించింది. ఈ పథకంలోకి మరింత మంది ఆపరేటర్లను తీసుకొచ్చింది. బస్సు బాగా లేకున్నా, రాకున్నా, సదుపాయాలు లేకున్నా, సిబ్బంది దురుసుగా ప్రవర్తించినా ఈ పథకం కింద పరిహారం చెల్లిస్తారు. ఇందుకోసం ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.తొమ్మిది వసూలు చేస్తారు. బస్సు ఆకస్మికంగా రద్దవడం, సీట్ల నాణ్యత బాగా లేకపోవడం వంటి సమస్యలు ఉన్నా ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చని సంస్థ చీఫ్​ ఆపరేటింగ్​ ఆఫీసర్​ రోహిత్​ శర్మ అన్నారు. ‘‘బస్సు రెండు గంటలకు మించి లేటైతే పరిహారం పొందవచ్చు. రద్దయితే టికెట్​ ధరకు రెండురెట్లు పరిహారం ఇస్తాం. ఈ పథకం కోసం 100 మంది ఆపరేటర్లను ఎంపిక చేశాం. వీరిలో 25 మంది ఏపీ, తెలంగాణ నుంచి ఉన్నారు. మేం మొత్తం 2,600 మంది ఆపరేటర్లతో కలిసి పనిచేస్తున్నాం. వీరిలో ఏపీఎస్​ఆర్టీసీ, టీఎస్​ఆర్టీసీ సహా పలు రాష్ట్రాల ఆర్టీసీలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో 500 మంది బస్​ ఆపరేటర్లు ఉన్నారు. మేం గత ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్ల టర్నోవర్​ సాధించాం. ఈసారి దీనిని రూ.2,000 కోట్లకు పెంచాలని చూస్తున్నాం.  మనదేశంలో ఇంటర్​సిటీ బస్​ మార్కెట్​ సైజు 10 బిలియన్​ డాలర్ల వరకు ఉంటుంది. మాకు 20 శాతం మార్కెట్​ వాటా ఉంది. అయితే ఇప్పటికీ 85 శాతం మంది ప్రయాణికులు కౌంటర్లలోనే టికెట్లు కొంటున్నారు. 25 శాతం మందే ఆన్​లైన్​లో కొంటున్నారు. మా ప్లాట్​ఫారమ్​ద్వారా ప్రయాణించే వారికి బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నాం. బ్రాండ్​ అంబాసిడర్​గా హీరో మహేశ్​ బాబును కొనసాగిస్తాం”అని రోహిత్​ వివరించారు.