"అభిలాష" మూవీ ట్రైలర్

"అభిలాష" మూవీ ట్రైలర్

అమర్ దీప్, అశ్విని రెడ్డి జంటగా  శివప్రసాద్ చలువాది దర్శకత్వంలో సి.హెచ్. శిరీష నిర్మించిన  చిత్రం ‘అభిలాష’. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రసాద్‌‌ ల్యాబ్స్‌‌లో జరిగింది. ట్రైలర్‌‌‌‌ను లాంచ్ చేసిన నటుడు పృథ్వి మాట్లాడుతూ ‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు లేవు. ఏది ఆడితే అదే పెద్ద సినిమా. ట్రైలర్ చాలా బావుంది. ఓ మంచి పాయింట్‌‌తో తీసిన ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుతున్నా’ అన్నారు.

‘విద్యకు ఉన్న ప్రాధాన్యాన్ని చూపిస్తూ, ఎలాంటి వల్గారిటీకి తావులేకుండా నవరసాల్లోని అన్ని అంశాలను మేళవించి తీశాం’ అన్నాడు దర్శకుడు. తమ కెరీర్‌‌‌‌కు ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుందని హీరోహీరోయిన్స్ చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.