వీరుడా.. సెల్యూట్

వీరుడా.. సెల్యూట్

అమృత్ సర్ : కోట్లాది మంది ఎదురుచూపులు.. క్షేమంగా తిరిగి రావాలన్న ప్రార్ధన లు.. ఫలి చాయి. దాయాది యుద్ధవిమానాన్ని కూల్చి.. యుద్ధఖైదీగా చిక్కి.. ప్రాణం పోతుందని తెలిసినా చెక్కు చెదరని ధైర్యంతో బెబ్బులిగా ముందుకు దూకిన మన వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్తమాన్​ సరిహద్దును దాటుకొని సొంత గడ్డపై క్షేమంగా అడుగుపెట్టారు. శుక్రవారం రాత్రి 9.21 గంటలకు ఆయనను పాక్​ అధికారులు..IAF​ అధికారులకు అప్పగించారు. వీరుడికి యావత్ దేశం గ్రాండ్ వెల్ కమ్ పలికింది. ఉదయం నుంచే.. శుక్రవారం ఉదయం నుం చే పంజాబ్ లోని వాఘా–అటారీ సరిహద్దు వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. అభినందన్​ను ఇక్కడే పాక్​ అధికారులు అప్పగిస్తారని తెలియగానే వేలాది మంది జనం తరలివచ్చారు.

ఎటుచూసినా జనం.. వారిని నిలువరించేందుకు చెమటోడ్చిన పోలీసులు.. క్షణ క్షణం ఏం జరుగుతుం దో తెలియజేసేందుకు తరలివచ్చిన మీడియా కెమెరాలు, మీడియా ప్రతినిధులతో ఆ పరిసరాలు కిక్కిరిసి పోయాయి. అభినందన్​ అప్పగింత క్రమంలో వాఘా–అటారీ బోర్డర్​ వద్ద రోజువారీ బీటింగ్​ రిట్రీట్ ను రద్దు చేశారు. చుట్టుపక్కలంతా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తాము ప్రత్యేక విమానాన్ని పంపుతామని, అందులో అభినందన్​ను పంపాలన్న భారత్ విజ్ఞప్తిని పాక్​ అధికారు లు తోసిపుచ్చారు. రోడ్డు మార్గం లో తీసుకొచ్చి సరిహద్దు వద్దే అప్పగిస్తామని తేల్చిచెప్పారు. దీంతో అభినందన్​కు స్వాగతం పలికేందుకు IAF​ అధికారులు అక్కడికి చేరుకున్నారు. లాహోర్ నుంచి .. శుక్రవారం ఉదయం అభినందన్​ను పాక్ అధికారులు ఇస్లామా బాద్‌ లోని భారత హైకమిషన్‌ కు అప్పగించారు. దీనికి రెడ్ క్రాస్​ ప్రతినిధులు మధ్యవర్తిత్వం వహించారు.

ఆయనను భారత్‌‌కు తీసుకువచ్చేందుకు అవసరమైన లాంఛనాలు పాక్‌ లోని భారత హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియా పూర్తి చేశారు. తర్వాత అభినందన్‌ ను లాహోర్‌ కు తీసుకువచ్చారు. మధ్యాహ్నమే వస్తాడని అందరూ భావించినా.. పలు కారణాల వల్ల అక్కడి అధికారులు తీవ్ర జాప్యం చేశారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అభినందన్‌ వాఘా సరిహద్దు వద్దకు రాగానే.. అక్కడి పాక్​ అధికారులు ఆయన సంతకాలు తీసుకున్నారు. సరిగ్గా రాత్రి 9.20కి వాఘా వైపు నుంచి పాక్​ తలుపులు తెరుచుకోగా.. ఇటు అటారీ వైపు భారత్ తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా వచ్చిన ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​ ఉన్నతాధికారులకు సరిహద్దు మీద అభినందన్​ను అప్పగించి పాక్​ అధికారులు వెనుదిరిగా రు. అటు తర్వాత ఎప్పటిలాగే రెండు వైపులా తలుపులు మూతపడ్డాయి. IAF​ అధికారులు అభినందన్​ను అటారి వైపు తీసుకువస్తుండగా.. అక్కడి జనం కేరింతలు కొట్టారు. అభినందన్​ పేరుతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అక్కడి నుం చి ఆయనను అధికారులు 30 కిలోమీటర్ల దూరంలోని అమృత్ సర్​కు..అటు తర్వాత IAF​ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు.