OTT Movies: OTTలో కడుపుబ్బా నవ్విస్తున్న ఫన్ ఎంటర్టైనర్.. టాప్ 1లో ట్రేండింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movies: OTTలో కడుపుబ్బా నవ్విస్తున్న ఫన్ ఎంటర్టైనర్.. టాప్ 1లో ట్రేండింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈమధ్య ఓటీటీలో వచ్చే కంటెంట్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ కి వెళ్లే అవసరం లేకుండా ఇంట్లో కూర్చొనే మంచి మంచి కంటెంట్ అవకాశం ఉండటంతో ఆడియన్స్ కూడా ఓటీటీ కంటెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఓటీటీ సంస్థలు కూడా ప్రతీవారం కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. అలా ఈవారం ఓటీటీకి వచ్చిన కొత్త మూవీ మై డియర్ దొంగ(My Dear Donga).

ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠం(Abhinav Gomatam) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో శాలిని కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, శశాంక్ తదితరులు కీ రోల్స్ చేశారు. బీఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం ఈ కామెడీ ఎంటర్టైనర్ ఈనెల (ఏప్రిల్) 19 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఫుల్ ఆన్ ఫన్ రైడ్ గా వచ్చిన ఈ సినిమాకు మొదటిరోజు నుండే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాను చేసుందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆహా టాప్ 1లో ట్రెండ్ అవుతోంది ఈ సినిమా. ఇక ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందనకు చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సినిమాకు ఇంత మంచి ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఇక మై డియర్ దొంగ మూవీ కథ విషయానికి వస్తే.. లవర్, బెస్ట్ ఫ్రెండ్స్ వదిలేసిన ఒక అమ్మాయికి ఒక దొంగతో పరిచయం అవుతుంది. ఆమె ఆ దొంగతో ఫ్రెండ్ షిప్ చేస్తుంది. మరి ఆ దొంగ ఎవరు? ఆ అమ్మాయి దొంగతో స్నేహం ఎందుకు చేసింది? వారి స్నేహం వళ్ళ ఏర్పడ్డ పరిస్థితులు ఏంటి? అనేది మిగిలిన కథ. వీలుంటే మీకు కూడా చూసేయండి.